![]() |
![]() |

అన్ని చానెల్స్ తో పాటు జీ కూడా సరిసమానంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే త్వరలో 18 వ జీ మహోత్సవం 2023 కార్యక్రమాన్ని రూపొందించారు. త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ ప్రోగ్రాం. "అంగరంగ వైభవంగా, తారల మధ్య ఘనంగా జరిగిన జీ తెలుగు మహోత్సవం సంబరాలు త్వరలో మన జీ తెలుగులో" అంటూ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది.
ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంబరాన్నంటబోతున్నాయి. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నారు. "జీ టీవీ వ్యూయర్స్ అందరికీ కంగ్రాట్యులేషన్స్" అని చెప్పాడు నవీన్ పోలిశెట్టి. "హ్యాపీ బర్త్ డే జీ..కంగ్రాట్యులేషన్స్" అని చెప్పింది నటి శ్రీలీల. "దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ గివింగ్ మీ అమేజింగ్ ఫామిలీ" అంది లావణ్య త్రిపాఠి. ఇలా ఈ షోలో ఆటలు, పాటలు, గేమ్స్, అవార్డ్స్ అన్ని రకాల సెగ్మెంట్స్ ని చూపించారు.
2005 లో ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ కేవలం సీరియల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ షోలో బుల్లితెర సీరియల్స్ లో నటీనటులంతా హాజరయ్యారు. అలాగే సెలబ్రిటీస్ చేతుల మీదగా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇక ఇందులో ఆది, కోన వెంకట్, మాళవిక నాయర్, నందిరెడ్డి, మధుప్రియ, సాకేత్ కొమండూరి, సుహాసిని, కౌశల్, మధుసూదన్, హరిత, జాకీ ఇలా అందరూ ఈ షోలో కనిపించబోతున్నారు.
![]() |
![]() |